సరస్వతీ శ్లోకములు
1.శారదనీరదేందుఘనసారపటీరమరాళమల్లికా
హారతుషారఫేనరజతాచలకాశఫణీశకుందమం
దారసుధాపయోధిసితతామరసామరవాహినీశుభా
కారత నొప్పునిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ ||
2.అర్చయిష్యే జగత్పూజ్యాం శారదాం విశదప్రభామ్ |
సిత పద్మాసనాం దేవీం త్రయంబకీం శశిభూషణామ్ ||
3.నమస్తే శారదాదేవీ కాశ్మీర పురవాసిని |
సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్ ||
4.యాకుందేందు తుషారహార ధవళా యాశుభ్రవస్త్రాన్వితా
యా వీణావరదండ మండితకరా యాశ్వేత పద్మాసనా |
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభిర్ దేవైః సదా పూజితా
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా ||
5.తల్లీ!నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్ సుశబ్ధమ్ము శో
భిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
ఫుల్లాబ్జాక్షీ!సరస్వతీ!భగవతీ!పూర్ణేందుబింబాననా!