- ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
- ద్వాదశజ్యోతిర్లింగాలు
- రావణకృత శివతాండవ స్తోత్రం
- శంభు దేవుని గూర్చి ప్రార్ధన
- శ్రీఅర్ధనారీశ్వర స్తోత్రం
- శ్రీబిల్వాష్టకం
- శ్రీచంద్రశేఖరాష్టకం
- శ్రీదక్షిణామూర్తి స్తోత్రం
- శ్రీలింగాష్టకం
- శ్రీమహేశ్వర పంచరత్న స్తోత్రం
- శ్రీశివపంచాక్షరీ స్తోత్రం
- శ్రీశివమానస పూజ ద్విపద
- శ్రీశివానందలహరీ
- శ్రీశివాష్టకం
- శ్రీశివాష్టోత్తర శతనామ స్తోత్రం
- శ్రీవైద్యనాథాష్టకం
- శ్రీవిశ్వనాథాష్టకం
- శ్రీశైల రగడ
- మంగళాష్టకం
- దారిద్ర్య దహన శివస్తోత్రం
"స్తోత్రములు" కి విచ్చేసిన మీకు నమస్కారము!!!
సనాతన ధర్మమునందు స్తోత్ర పఠనము కేవలము ఇహము నందు కోరికలను ఈడేర్చగలిగిన సాధనము గానే కాక భగవంతుని యందు భక్తి కుదురుకుని కడకు ఆయనను చేరుటకు సాధనముగా పరిగణింపబడినది. అటువంటి స్తోత్రములను కొన్నిటిని పరదేవత యొక్క అనుగ్రహముతో తెలుగులో ఈ వెబ్ సైట్ నందు సంకలనం చేయబడినది.
దేవతలు, ఋషులు, గురువులు మనని అనుగ్రహించి ఇచ్చినవే స్తోత్రములు. ప్రతి ఒక్క స్తోత్రము తప్పులు లేకుండా, భక్తితో చదివినప్పుడు ఒక గొప్ప ఆనందానుభూతి కలుగుతుంది. ఆ అనుభూతిని చదివిన ప్రతి ఒక్కరు పొందాలి అన్న ఆలోచనతో సాధ్యమైనంతవరకు స్తోత్రములను కూర్చటంలో శ్రద్ధ తీసుకోవటం జరిగినది, అయిన తప్పులు ఉండి ఉండవచ్చు. అటువంటివి ఉండి ఉంటే నన్ను మన్నించగలరు. ఈ రోజులలో మనము తెలుగులో మాట్లాడుతున్నప్పటికీ, అనేక విషయములను చదవటం గాని, రాయటం గాని ఇంగ్లీషు భాషలోనే చేయటం జరుగుతోంది. ఆ కారణం చేత తెలుగులో చదువుకోవటానికి ఇబ్బంది కలిగినవారికోసం, ప్రతి స్తోత్రమును పఠించిన ఆడియో కుడా ఉంచబడినది. దానిని వింటూ స్తోత్రములను తెలుగులో చదువుకోగలుగుతారని ఆశిస్తున్నాను. ఈ వెబ్ సైట్ నందున్న స్తోత్రములను యూట్యూబ్ వీడియోలుగా తయారుచేసి మా “శ్రీమాతా” యూట్యూబ్ ఛానెల్ నందు పొందుపరచటమైనది.మీరు అక్కడ కూడా చదువుకోగలరు మరియు వినగలరు.
ఈ నా చిన్న ప్రయత్నములో నన్ను ఎంతగానో ప్రోత్సహించి ఈ వెబ్ సైట్ ను రూపొందించిన నా భర్తకు కృతజ్ఞతలు.మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించే గురువులకు, పెద్దలకు నా నమస్కారములు.పరమేశ్వరుని పాదాల యందు బాయని భక్తిని,సనాతన ధర్మమునందు చెదిరిపోని గౌరవాన్ని ప్రసాదించమని భగవతిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
|| సర్వేజనాః సుఖినోభవన్తు ||
మీ సలహాలు, సూచనలు మాకు తెలుపుట కొరకు stotramulu@gmail.com నకు వ్రాయగలరు.
https://sanskritdocuments.org/: వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు
ఇట్లు,
లక్ష్మి కుమారి.బి