శ్రీశివపంచాక్షరీ స్తోత్రం

ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ ||

మందాకిని-సలిలచందన-చర్చితాయ నందీశ్వర-ప్రమథనాథ-మహేశ్వరాయ
మందారపుష్ప-బహుపుష్ప-సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ ||

శివాయ గౌరీవదనాబ్జ-వృంద-సూర్యాయ దక్షాధ్వరనాశకాయ
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ ||

వశిష్ఠ-కుంభోద్భవ-గౌతమార్యమునీంద్ర-దేవార్చితశేఖరాయ
చంద్రార్క-వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ ||

యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ ||

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||