శనైశ్చర స్తోత్రం

||పల్లవి|| దివాకర తనుజం శనైశ్చరం
ధీరతరం సంతతం చింతయేహమ్
||అనుపల్లవి|| భవాంబు నిధౌ నిమగ్న జనానాం
భయంకరం అతి క్రూర ఫలదం
భవానీశ కటాక్ష పాత్ర భూత
భక్తిమతాం అతిశయ శుభ ఫలదమ్
||చరణం|| కాలాంజన కాంతి యుక్త దేహం
కాల సహోదరం కాక వాహం
నీలాంశుక పుష్ప మాలావృతం
నీలరత్న భూషణాలంకృతమ్
మాలినీ వినుత గురుగుహ ముదితం
మకర కుంభ రాశినాధం
తిల తైల మిశ్రితాన్న దీపప్రియం
దయా సుధా సాగర నిర్భయమ్
కాల దండ పరి పీడిత జానుం
కామితార్ధ ఫలద కామ ధేనుం
కాల చక్ర భేద చిత్ర భానుం
కల్పితచ్ఛాయా దేవీ సూనుమ్
దివాకర తనుజం శనైశ్చరం
ధీరతరం సంతతం చింతయేహమ్